కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్ట ర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బల్దియా కార్యాల యంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన అధికారులతో ప్రగతి పనులపై స మీక్షించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్‌ఐడీ సీ) నిధులతో చేపట్టిన పనులతోపాటు పారిశుధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూలు, టౌన్ ప్లానింగ్, త దితర విభాగాల పనితీరుపై కలెక్టర్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిచేయాలని సూచించారు. ఫిబ్రవరి వరకు విద్యుత్ స్తంభాలకు సోలార్ ప్యాన ల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. వ చ్చే పదేళ్ల వరకు బల్దియాపై విద్యుత్ బిల్లుల భారం పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రూ.1.25 కోట్లతో చేపట్టిన తాగునీటి సరఫరా ప నులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. 95శాతం ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య ఆటోలు, ట్రాక్టర్లను సోమవారం నుంచి వినియోగంలోకి తీసుకురావా లని తెలిపారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుమతి లేకుండా చేప ట్టే నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment