ఉత్తమ ఫలితాలు సాధించాలి
పెద్దపల్లిరూరల్: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని సామర్థ్యాలు పెంచాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, సమగ్ర శిక్ష సమన్వయకర్త ిపీఎం షేక్ పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
పెద్దపల్లిరూరల్: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే ిసీపీఆర్ ప్రక్రియపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ బబ్ల్లూ విశ్వాస్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ శాఖల ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షక్ష ఇచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తారని తెలిపారు. అయితే, ఆకస్మికంగా గుండెపోటు వచ్చి చాలామంది మరణిస్తున్నారని, గుండెపోటు సమయంలోనే సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడేందుకు 50 శాతం అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అధికారులు బండి ప్రకాశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ మరోసారి వాయిదా
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీలో స్థాపించే తెలంగాణ స్టేజీ–2 రెండోదశ 2,400 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ రెండో‘సారీ’ వాయిదా పడింది. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్ మైదానంలో గురువారం ప్రజాభిప్రాయ సేక రణ జరగాల్సి ఉంది. ఈమేరకు ఏర్పాట్లు చేశా రు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా పడిందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు బుధవారం తెలిపారు. తొ లుత నవంబర్ 29న ప్రజాప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈనెల 19కి వాయిదా పడింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని, ఇందులో అసెంబ్లీ సమావేశాలు ఉండడం, పోలీసు సిబ్బంది అక్కడకు బందోబస్తుకు వెళ్లడం, స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం తదితరణ కారణాలు ఉంటాయనే చర్చ సాగుతోంది.
క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించారు. బాలబాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈనెల 22న నాగర్‌కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. వివిధ విభాగాల్లో ఎంపికై నవారికి ఆయన మెడల్స్ అందజేశారు. పీడీ అంతటి శంకరయ్య, పీటీలు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం బ్రిడ్జి కోర్సులో ప్రవేశాల కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బుసిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. 60శాతం మార్కులతో ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తిచేసిన వారు 30 జనవరి 2025లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మెరిట్ ప్రాతిపాధికన విద్యార్థులను ఎంపిక చేస్తారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment