చలితో సహవాసం
● పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● పెరుగుతున్న చలితీవ్రత ● ప్రయాణాలు వాయిదా ● చలిలోనే రోజూవారి కార్యకలాపాలు
పెద్దపల్లిలో ఉదయమే కల్లాపి చల్లుతున్న మహిళ
రాత్రి వేళల్లోనే కాదు.. పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయి. చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీనికి ఈదురుగాలులు తోడవడంతో జిల్లా వాసులు గజగజ వణుకుతున్నారు. రోజూవారి కార్యకలాపాల నిర్వహణకు పడరానిపాట్లు పడుతున్నారు. అత్యవసరమైతేనే ఉదయం, రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్నారు. దినసరి కూలీలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, సిబ్బంది, వాహనదారులు, రైతులు, రైతు కూలీలు చలినుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తూనే తమ పనులు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు పట్టణ శివారు, సమీప గ్రామాల్లో చలితీవ్రతకు అద్దం పట్టేలా ‘సాక్షి’ మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కొన్ని చిత్రాలను తన కెమెరాలో ఇలా బంధించింది. – మర్రి సతీశ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment