అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
గోదావరిఖనిటౌన్: స్థానిక సింగరేణి ఆర్‌జీ–1 జీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ శనివారం ప్రారంభించారు. సింగరేణి కాలరీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 42ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నాయకు లు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యు డు రేణికుంట్ల ప్రవీణ్, ఆర్‌జీ–1 జీఎం లలిత్‌కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు యాట ఓదెలు, ఆరెపల్లి రామచందర్, బడికెల కృష్ణ, జనగామ నర్సయ్య పాల్గొన్నారు.
పాఠశాల సందర్శన
ధర్మారం(ధర్మపురి): రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలను లక్నో నుంచి వచ్చిన కేంద్ర బృందంలోని ప్రతినిధులు శనివారం సందర్శించారు. ప్రతినిధులు ప్రవీణ్‌యాదవ్, అత్తర్ సలీం ఈ బృందంలో ఉన్నారు. ఒకటి నుంచి ఐదో తరగ తి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అనుగుణంగా ఆశించిన సామ ర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఫుడ్‌స్టాల్స్ ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు వంశీమోహనాచార్యులు, ఉ పాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, పాఠశా కమిటీ చైర్‌పర్శన్ ప్రమీల, మండల విద్యాధికారి ఛాయాదేవి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం ఫేక్, జిల్లా రిసోర్స్ పర్శన్ శ్రీకాంత్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మురుగు నీటికాలువలో దిగి కౌన్సిలర్ నిరసన
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ నాంసాని సరేశ్‌బాబు శనివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు దానిపక్కన డ్రైనేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు, డ్రైనేజీ కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన హయాంలో రూ.కోటి మంజూరు చేయించారని గుర్తుచేశారు. ఆ నిధులతోనే బీటీ రోడ్డు నిర్మించి, డ్రైనేజీ పనులు చేపట్టకుండా చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవర కూ మురుగునీటి కాలువ నుంచి బయటికి రానని ఆయన భీష్కించుకు కూర్చున్నారు.
ఇంగ్లిష్ బోధకులు కావలెను
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో ఇంగ్లిష్ పాఠ్యాంశం బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరస్పాండెంట్, డీజీఎం(పర్సనల్, అధికార ప్రతినిధి) అనిల్ కుమార్ శనివారం కోరారు. 2024–25 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిన ఇంగ్లిష్ బోధించేందుకు బీఏ, ఎంఏ, బీఎడ్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీలోగా పాఠశాలలో తమ దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.
రేపు కూరగాయల మార్కెట్ బంద్
పెద్దపల్లిరూరల్: హోల్‌సేల్ వ్యాపారి ఖాలిక్ భాయ్ మృతికి సంతాప సూచకంగా సోమవా రం స్థానిక కూరగాయల మార్కెట్‌ను బంద్ చేస్తామని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మార్కెట్ బంద్ ఉన్నందున వినియోగదారులు తమకు అవసరమైన కూరగాయలను ఆదివారమే తీసుకెళ్లాలని సూచించారు. బంద్‌కు అందరూ సహకరించాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment