నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
గోదావరిఖని: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. కేసుల ప్రస్తుత స్థితిగతులు, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు తీరు గురించి పోలీస్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నేరాల కట్టడికి సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజు తదితరులు ఉన్నారు.
ధ్యానం జీవితంలో భాగం కావాలి
ధ్యానం నిజజీవితంలో భాగం కావాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ధ్యానం సాధన చేయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వలంటీర్స్ రామ్మోహన్ బండా, ఓంప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సీపీ మాట్లాడుతూ యోగా, ధ్యానం ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక, భౌతిక అభ్యాసాలన్నారు. నిత్య ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. వివిధ కారణాలతో అధిక ఒత్తిడికి గురవుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియలు చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనరెడ్డి, ఆర్‌ఎస్‌ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment