రుణమాఫీ కాలేదంటే రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: రైతు సంక్షేమం కాంగ్రెస్ సర్కార్‌తో నే సాధ్యమని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కావాలని ప్ర భుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రుణమాఫీ పేరిట రైతులను మభ్యపెట్టారని మండిపడ్డారు. నాలుగు విడతల్లో రూ.లక్షమాఫీ చేస్తే వడ్డీకే సరిపోలేదన్నా రు. ఇది రైతులను మోసం చేయడం కాదా? అని ప్ర శ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రుణమాఫీ కాలేదని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పెద్దపల్లికి వస్తే 90శాతం రుణమాఫీ జరిగిన విషయాన్ని చూపిస్తానాని స్పష్టం చేశారు. నిరూపించకుంటే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. సన్నవడ్లకు పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.51 కోట్ల బోనస్ వస్తోందని, ఇందులో రూ.46 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అ య్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా భూములకు ఒక్కచుక్క నీరు అందించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే అన్నారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తావా?
ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్
Comments
Please login to add a commentAdd a comment