మంథని: స్థానిక సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతిగౌడ్ మంగళవారం ప్రారంభించారు. రా ష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కో ర్టుల్లో కక్షిదారులు, న్యాయవాదుల సౌకర్యార్థం ఈ సేవ కేంద్రాలను హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఎల్‌ఎ న్ హరిబాబు, ఉపాధ్యక్షుడు కె.రఘోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.సహేందర్‌రెడ్డి, న్యాయ వాదులు సువర్ణ చంద్రశేఖర్, శశికాంత్ కాచె, బోట్ల ఆంజనేయులు, సత్యనారాయణ, సదన్ కుమార్, శశి భూషణ్ కాచె పాల్గొన్నారు.
‘విద్యుత్ కొరత రానివ్వం’
పెద్దపల్లిరూరల్: వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ట్రా న్స్‌కో సర్కిల్ ఎస్‌ఈ మాధవరావు తెలిపారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్ సరఫరా చేసేందుకు జిల్లాలో 160 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించా రు. మరో 74 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment