తహసీల్ ఆఫీసు తనిఖీ
రామగుండం: కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదు దరఖాస్తుల ప్రగతి, ధరణి అర్జీలపై ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
పైరవీలకు తావులేదు
ధర్మారం(ధర్మపురి): ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక లో పైరవీలకు తావులేదని, అర్హులైన పేదలకు తప్పకుండా మంజూరు చేస్తామని ప్రభుత్వ వి ప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల ప రిషత్ కార్యాలయంలో 155 మంది లబ్ధిదారులకు రూ.29 లక్షల విలువైన సీఎం సహాయ ని ధి చెక్కులను ఆయన మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలకు వెళ్లి 11శాతం వడ్డీతో అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమ పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఏఎంసీ చైర్మన్ లావుడ్య రూప్లనాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ ఎంపీపీ కొడారి అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో ప్రేమ్‌కుమార్, ఎంపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ కొనివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
మెట్‌పల్లిరూరల్: బైక్ కొనివ్వలేదనే కారణంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన మామిడాల రణధీర్ (22) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదుతున్నాడు. ఇటీవల ఓ ఫంక్షన్ నిమిత్తం ఇంటికి వచ్చిన కిరణ్ బైక్ కొనివ్వాలని తరచూ గొడవ చేస్తున్నాడు. తల్లిదండ్రులు కొనివ్వకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 22న గడ్డిమందు తాగాడు. కు టుంబ సభ్యులు కిరణ్‌ను మెట్‌పల్లిలోని ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. రణధీర్ తండ్రి ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైలుకింద పడి వృద్ధుడు..
గంగాధర: గంగాధర గ్రామానికి చెందిన పులిచర్ల భూమయ్య (65) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం నుంచి నిజామాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడంతో తల, మొండెం వేరుగా పడ్డాయి. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment