సమయపాలన పాటించకుంటే చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): సమయపాలన పాటించ ని వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది హడలిపోయారు. పలు విభాగాల్లో డాక్టర్లు లేకపోవడంతో వారి గురించి ఆరా తీశా రు. బయోమెట్రిక్ వేసి విధులకు హాజరుకాని వారి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాత బ్లాక్‌తో పాటు కొత్త బ్లాక్ లోని అ న్ని విభాగాలు, వార్డులను పరిశీలించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సే వలు అందించాలని సూచించారు. స్కానింగ్ పరీక్షల ఫలితాలను త్వరగా అందజేయాలన్నారు. అనంతరం సిమ్స్ కాలేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. డాక్టర్ల కోసం వేచి ఉన్న పేషెంట్లు, వారి సహాయకులతో మాట్లాడి, వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. టిఫా స్కానింగ్ సేవలను గర్భిణు లు వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆ వరణలో నిర్మిస్తున్న 355 పడకల భవనం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. మరో 10 నెలల్లో పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్, ఆర్‌ఎంవోలు అశోక్, అప్పారావు, చంద్రశేఖర్, తిరుమలేశ తదితరులు పాల్గొన్నారు.
ఏసు అనుగ్రహం ఉండాలి : మక్కాన్‌సింగ్
గోదావరిఖని: ఏసు అనుగ్రహం అందరిపై ఉండాలని రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆకాంక్షించారు. స్థానిక బృందావన్ గార్డెన్‌లో ప్రభుత్వం తరఫున మంగళవారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. మానవవాళికి ప్రేమ, శాంతిమార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని అన్నారు. అనంతరం కేక్‌కట్ చేసి మిఠాయిలు పంపిపెట్టారు. ఏసీపీ రమేశ్, తహసీల్దార్ కుమారస్వామి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవుల అభ్యున్నతికి కృషి : విజయరమణారావు
పెద్దపల్లిరూర ల్: సీఎం రే వంత్‌రెడ్డి సారథ్యంలోని త మ ప్రభుత్వం క్రైస్తవుల అ భ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రభుత్వ తరఫున జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, కౌన్సిలర్లు, పాస్టర్లు, క్రిస్టియన్ మతపెద్దలు, ప్రజాప్రతినిధులతోపాటు తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బోనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
పెద్దపల్లిరూరల్: కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని పాలకుల ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరారు. ఈమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో బోనాలతో పోచమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అమరవీరుల స్థూపం నుంచి కోలాటాలు ఆడుతూ, తలపై బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. పాలకుల మనసు మార్చి తమ సమస్యలకు పరిష్కారం చూ పాలని జేఏసీ అధ్యక్షుడు తిప్పని తిరుపతి, ప్రతినిధులు కుంభాల సుధాకర్, సంధ్యారాణి కోరారు. నాయకులు రాజ్‌కుమార్, శ్రీనివాస్, స్వప్న, స్వరూప, మంజుల, కల్పన, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment