బకాయిదారులకు నోటీసులు
కోల్‌సిటీ(రామగుండం): ఆస్తిపన్ను బకాయిదారులకు రామగుండం నగరపాలక సంస్థ ఎఫ్‌ఏసీ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం నోటీసులు జారీచేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లించని ఎనిమది మందికి చివరి నోటీసులను జారీ చేసినట్లు అధికారులు వివరించారు. ఈనెల 31వ తేదీలోగా పెనాల్టీతో ఆస్తిపన్ను చెల్లించకపోతే పురపాలక చట్టం ప్రకారం బకాయిదారులపై చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. దీంతో బకాయిదారుల్లో గుబులు మొదలైంది.
కన్నుల పండువగా శ్రీకృష్ణ–రుక్మిణీ కల్యాణం
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరాజరాజేశ్వరస్వామి అలయలో శ్రీకృష్ణ–రుక్మిణీ కల్యాణం సోమవారం కన్నులపండువగా జరిపించారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని పల్లకీలో పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం వే ణుగోపాలస్వామి అలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అకులు రంగనాథాచార్యులు, ఉ ద్దండ నవీన్, శ్రీమధ్భాగవత ప్రవచకులు ర మాదేవి, రాంమోహన్‌రావు, మాజీ ఉప సర్పంచ్ కొప్పుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన
పెద్దపల్లిరూరల్: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ 21 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద గల దీక్ష శిబిరం ఎదుట రోడ్డుపై సోమవారం ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్, సంతోష్, ఆకుల స్వామివివేక్ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కుంబాల సుధాకర్, తిరుపతి, మల్లయ్య, రవిరాజ్, రాజ్‌కుమార్, సంపత్‌కుమార్, రహీముద్దీన్, స్వప్న, జ్యోతి, పిల్లి రమేశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నియామకం
రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మడ్డి తిరుపతిగౌడ్‌ను రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్, కాంగ్రెస్ నాయకుడు అయోధ్యసింగ్ ఠాకూర్‌కు తిరుపతిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
రైల్వే ఉద్యోగికి పురస్కారం
రామగుండం: స్థానిక రై ల్వేస్టేషన్ యార్డులో విధు లు నిర్వహించే కర్మకొండ కుమారస్వామి(పాయింట్స్ మెన్) అతి విశిష్ట రైల్వే సేవ పురస్కారం–2024కు ఎంపికయ్యాడు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే రైల్ నిలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన సేవా పురస్కారం అందుకున్నారు. విధి నిర్వహణలో నిర్దేశిత సమయంలోగా వ్యాగన్లను షంటింగ్ చేసి పంపించడంలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. కార్మికులు తమ్మడి నర్సింగరావు, మహంకాళి శ్రీనివాస్, సలిగంటి సదానందం, ఇల్లందుల వెంకటేశ్ తదితరులు కుమారస్వామికి అభినందనలు తెలిపారు.
గవర్నమెంట్ ప్లీడర్‌గా కిశోర్
పెద్దపల్లిరూరల్: జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీ డర్‌గా మార కిశోర్ ని యమితులయ్యారు. ఈమేరకు సోమవా రం సంబంధిత శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన నియామకానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావులకు కిశోర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment