క్రీడలతో మానసిక ప్రశాంతత
గోదావరిఖనిటౌన్(రామగుండం): మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల ప్రభుత్వ న్యాయవాదులుగా నియమితులైన భాగవతుల శాంతన్‌కుమార్, కొండు సౌజన్య, మంథని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నియమితులైన బార్ అసోసియేషన్ సభ్యురాలు బాస అనురాధను న్యాయ మూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. నూతన సంత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు వెంకట సచిన్‌రెడ్డి, వెంకటేశ్ దుర్వ, కుమారి స్వారిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి దూడపాక లింగస్వామి, రామటెంకి శ్రీనివాస్, సంతోష్, భానుకృష్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జడ్జి టి.శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment