బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
కోల్‌సిటీ(రామగుండం): ఆపరేషన్ స్మైల్–11లో పాలుపంచుకుంటున్న ప్రతీ అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కమిషనరేట్‌లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలన్నారు. బిక్షాటన చేస్తున్న వారు, బాలకార్మికుల గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112 నంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతీ పోలీస్ డివిజన్‌స్థాయిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్‌మెంట్ల అధికారులతో నెల రోజులపాటు ఇటుక బట్టీలు, రైల్వే, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లను పరిశీలించి, కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్ రమేశ్‌బాబు, సీడడ్ల్యూ సీ చైర్మన్ శ్రీధర్, డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి, లేబర్ ఆఫీసర్లు హేమలత, సత్యనారాయణ, డీసీపీవోలు కమలాకర్, ఆనంద్, పీవో జితేందర్, డీఈవో సెక్టర్ ఆఫీసర్లు సత్యనారాయణమూర్తి, అజీముద్దీన్ దబీర్, సంజీవయ్య, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్ రజిత, చైల్డ్‌లైన్ ప్రతినిధులు ఉమాదేవి, రమాదేవి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీపీ ఎం శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment