సొంతింటి పథకం అమలు చేయండి
కోల్‌సిటీ(రామగుండం): సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలని సీఐటీ యూ నాయకులు డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక పెండింగ్ అంశాల పరిష్కారానికి చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. సొంతింటి పథకం, అలవెన్సులపై ఐటీ మాఫీ, మారుపేర్లు తదితర సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. యూనియన్ సలహాదారు భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, ఉపాధ్యక్షులు మేదరి సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment