అదనపు కౌంటర్ ఏర్పాటు చేయాలి
రామగుండం: రామగుండం రైల్వేస్టేషన్‌లో అదనంగా రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని గురువారం రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్‌కు రైల్వే ప్రజాసంబంధాల మాజీ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు ఫాక్స్‌లో వినతిపత్రం పంపించారు. ప్రస్తుతం అయ్యప్ప మాలాధారణ స్వాములు వేలాదిగా రామగుండం రైల్వేస్టేషన్ నుంచి శబరిమలకు వెళ్లనుండడంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే కుంభామేళా నేపథ్యంలో రిజర్వేషన్ కౌంటర్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండనుంది. రైల్వేశాఖ, పెద్దపల్లి ఎంపీ స్పందించి అదనపు కౌంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. పూసాల రాజేశ్, రహీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment