ఇల్లెందు టు మహారాష్ట్ర
● సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం దందా ● చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న మంథని పోలీసులు ● 28 టన్నుల బియ్యం.. రూ.11 లక్షల విలువ
మంథని: ఎక్లాస్‌పూర్ అటవీ శాఖ చెక్‌పోస్ట్ దాటి పెద్దఎత్తున అక్రమంగా రవాణా అవుతోందనడానికి సోమవారం పోలీసులకు పట్టుబడిన రేషన్ బియాన్నే నిదర్శనంగా పేర్కొనవచ్చు. మంథని ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. అక్రమంగా ప్రజాపంపిణీ బియ్యం రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు మంథని మండలం ఎక్లాస్‌పూర్ చెక్‌పోస్టు వద్ద సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా రేషన్ బియ్యం కనిపించాయి. వాటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి మహారాష్ట్రకు అనుమతులు లేకుండా తరలిస్తున్నారని తేలింది. పట్టుబడిన వాహనంలోని 400 ప్లాస్టిక్ సంచుల్లో 28 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.10,92,000 వరకు ఉంటుందని ఎస్సై వివరించారు. అనుమతి లేకుండా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా మంగళగూడకు చెందిన డ్రైవర్ నర్రా పెద్దలు, తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన లారీ క్లీనర్ దాసరి బాబు, లారీ ఓనర్, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన కొలిపాక కిరణ్‌కుమార్ నిందితులని ఎస్సై వివరించారు. పీడీఎస్ బియ్యం లారీని పట్టుకొని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించామన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని చాకచక్యంగా పట్టుకున్న మంథని ఎస్సై, సిబ్బందిని సీఐ రాజు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment