అక్రమ పట్టా రద్దు చేయండి
● మాకు న్యాయం చేయండి
● దళితుడి వేడుకోలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తనకు విక్రయించిన భూమిని మరొకరికి పట్టా చేశాడని, ఈ అక్రమ పట్టాను రద్దు చేయాలని బాధితుడు ఆవేదన చెందాడు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు వాపోయాడు. మండల కేంద్రానికి చెందిన బాధితుడు ఇనుగాల రాములు కథనం ప్రకారం.. అదేగ్రామానికి చెందిన వెనిశెట్టి రమేశ్ వద్ద సుమారు 15 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 3.36 ఎకరాల వ్య వసాయ భూమిని రాములు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా చెల్లించాడు. అయినా, వ్యవసాయ భూమి రాములు పే రిట పట్టా చేయకుండా దాట వేస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. అదే భూమిని మరొకరికి విక్రయించి అక్రమంగా పట్టా చేయించాడు. రాములును స దరు వ్యక్తి మోసం చేశాడు. ఈవిషయంపై జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఉన్నతాధికారులకు సైతం బాధితుడు పలుప ర్యాయాలు ఫిర్యా దు చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని, బాధ్యుడిపై తగిన చర్యలు తీసు కుని అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితుడు కోరుతున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. అయితే, ఇనుగాల రాములు దళితుడు కావడంతోనే రమేశ్ మోసం చేశాడని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు మోకాపై విచారణ చేసి రాములుకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ జి ల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్, ఆల్ ఇండి యా అంబేడ్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు పాల రాజేశం కోరారు. నాయకులు జూపాక ఉమామహేశ్వర్, ఇనుగాల రాజయ్య, పాల శంకర్, శనిగరపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment