క్రీడాకారులకు ప్రోత్సాహం
పెద్దపల్లిరూరల్: ప్రతిభ చూపే క్రీడాకారులకు ప్రభుత్వపరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, వారంతా తమకు ఆసక్తిగల క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని కలెక్టర్ శ్రీహర్ష ఆకాంక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌రావుకు రూ.4,43,300 వెచ్చించి కొనుగోలు చేసిన కాంపౌండ్ బో పరికరాన్ని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. ధీరజ్‌రావు భవిష్యత్తులో అర్చరీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదగాల ని ఆకాంక్షించారు. క్రీడాశాఖ అధికారి సురేశ్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, ప్రతినిధులు సురేందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కిట్లు పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్– 2024 పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు డీఈవో మాధవి, జెడ్పీ సీఈవో నరేందర్, బీసీ వెల్పేర్ ఆఫీసర్ రంగారెడ్డి, క్రీడాశాఖ అధికారి సురేశ్ సోమవారం కిట్లు అందజేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని వా రు ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీ లను నిర్వహించే ప్రాంతాలకు క్రీడాకారులు బయ లు దేరి వెళ్లారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రతినిధులు సురేందర్, రమేశ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment