జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్యసేవలు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యసేవలు మెరుగయ్యాయని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ సూచించారు. జీజీహెచ్‌లో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతే డాదిలో చాలారిస్క్ కేసులను సవాల్‌గా తీసుకొని వైద్యసేవలు అందించామన్నారు. ఆపరేషన్ థియేటర్లను ఆధునికీకరించామని, ఏఆర్‌టీ కేంద్రాన్ని కూడా బ్లడ్ సెంటర్ సమీపంలోని భవనానికి తరలించామని తెలిపారు. కంటి శస్త్రచికిత్సలు నిర్వ హించడానికి ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈఎన్‌టీ, ఎంఆర్ ఐ, న్యూరో తదితర ఆధునిక వైద్య సేవలు అందిస్తామని వారు వివరించారు. బోధనాస్పత్రిలో స్పెషలిస్టుల కొరత ఉన్నా.. ఉన్నవారితోనే అంతరాయం కలుగకుండా సేవలు అందిస్తున్నామని వివరించారు. ఇంతమంచి సేవలు అందిస్తున్నా కొందరు స్థానికంగా ఉండడం లేదని ఆరోపణలు చేస్తుండడం బాధగా ఉందని మహిళా వైద్యులు కంటతడి పెట్టారు. ప్రొఫెసర్లు అరుణ, నరేందర్, లక్ష్మీనర్సయ్య, శ్రీదేవి, వేణుమాధవ్, అనంతబాబు, రాజు, హర్షిణి, శ్రీహర్ష పాల్గొన్నారు.
సూపరింటెండెంట్ దయాల్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment