కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు పెట్రోల్ బంక్‌లకు పెనాల్టీ నోటీసులను జారీచేసినట్లు ఎఫ్‌ఏసీ కమిషనర్ అరుణశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంక్‌ల నిర్మాణ అనుమతులు లేకపోవడంతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని సంతోషిమాత ఆటో సర్వీసెస్ బంక్‌కు రూ.14.78 లక్షలు, లేపాక్షి ట్రాన్స్‌పో ర్ట్‌కు రూ.38.50 లక్షలు, హరా ఫిల్లింగ్ స్టేషన్ బంక్‌కు రూ.19.36 లక్షలు జరిమానా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పెనాల్టీలను చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment