రూపురేఖలు మార్చుతాం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్ర హోదాకు తగిన విధంగా పెద్దపల్లిని అభివృద్ధి చేస్తాం. కొత్త ఏడాదిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి రూపురేఖలు మార్చుతాం. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక వరాలు ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా జారీ చేశారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు పత్తిపాక రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తాం. పెద్దపల్లిలో త్వరలోనే ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తాం. బైపాస్ రోడ్డు, రూరల్, మహిళా, ఎలిగేడులో పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు.. ఇంకా అనేక అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఇవేకాకుండా పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో రూ.కోట్లు వె చ్చించి చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రధాన కూడళ్లను సుందరీకరించడంతోపాటు పట్టణ ప్రజల వినోదం కోసం పార్క్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment