డాక్టర్లు అందుబాటులో ఉండాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు ● జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ ● పారిశుధ్యం నిర్వహణపై అసంతృప్తి
కోల్‌సిటీ(రామగుండం): ప్రభుత్వ ఆస్పత్రి వై ద్యులు పేషెంట్లకు అందుబాటులో ఉండాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అ వసరమైన పేషెంట్లకు శస్త్రచికిత్సలు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రామగుండం నర్సింగ్ కాలేజీని కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న తరగతుల వివరాలపై ఆరా తీశారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంలు అశోక్, రేణుక, రాజుతోపాటు నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసూన, వైస్ ప్రిన్సిపాల్ సుశీల తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక
పాలకుర్తి(రామగుండం): సంక్షేమ పథకాలకు అర్హులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేస్తామ ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జీడీనగర్‌లో చేపట్టిన రేషన్‌కార్డు, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకాల సర్వే ను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల్లో వ్యవసాయానికి యోగ్యంలేని భూములనే రైతుభరోసా జాబితా నుంచి తొలగించాలని సూచించారు. తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఆర్‌ఐ ఇంతియాజ్‌అలీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment