సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ టౌన్:
కొడుకు అడుగుతున్నాడని ఆలోచన లేని నిర్ణయాలు తీసుకోవద్దు. కూతురు అలుగుతోందని అడిగిందల్లా కొనివ్వొద్దు. చదువుతున్నారు కదా అని ఏమరుపాటుగా ఉండొద్దు. చదవడం లేదని ఎప్పుడూ వెంటపడొద్దు. ఇంటికి ఎప్పుడొస్తున్నారు.. ఎప్పుడెళ్తున్నారో గమనించాలి. ప్రస్తుతకాలంలో పిల్లలతో స్నేహంగా ఉండాలి కానీ.. వారిపై అతిప్రేమ ప్రమాదకరంగా మారుతోంది. అన్ని విషయాల్లో సరే అని కొన్ని సందర్భాల్లో కుదరదంటే వారి మనసు నొచ్చుకుంటోంది. వద్దు అనే పదం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీనేజీ యువత కొందరు ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటుండగా... చేతికి అందివచ్చిన పిల్లలు కానరాని లోకాలకు చేరడంతో ఆయా తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది.
కాలం మారుతోంది..
కాలం మారుతోంది. దాంతో పాటు పిల్లల్లో ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. ప్రతీ అంశాన్ని త్వరగా స్వీకరించడంతో పాటు దానిపై నెగెటివ్ ఆలోచన చేయడంలో ముందుంటున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఆలోచన ధోరణిని గమనిస్తూ, అలవాట్లపై శ్రద్ధ చూపాలి. సెల్‌ఫోన్ కొనివ్వలేదని, బైక్ కావాలని, కోరింది కొనివ్వడం లేదనే కారణాలతో పసిపిల్లలు, యుక్త వయసుగల వాళ్లు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ కోరికలను తీర్చుకునే క్రమంలో ఎంతకై నా తెగిస్తున్నారు. ఈ విషయాల్లో కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. వారికి ఏదీ అవసరం.. ఏది అనవసరం అనేది కూర్చోబెట్టుకుని వివరించే ప్రయత్నం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment