చట్టాలపై అవగాహన ఉండాలి
ఓదెల(పెద్దపల్లి): విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ సూచించారు. కనగర్తి హై స్కూల్‌లో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. నేరరహిత సమాజం కోసం విద్యార్థులు, యువకులు కృషి చేయాలని సూచించారు. సెల్‌ఫోన్, మద్యం, గంజాయి, సిగరెట్లకు దూరంగా ఉండాలని అ న్నారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శంకరయ్య, ఎంఈవో రమేశ్, ఏఎస్సై వీరస్వా మి, సుల్తానాబాద్ బార్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు
కాల్వశ్రీరాంపూర్/ఓదెల/ముత్తారం: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా సర్వే చేయాల ని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి, ఓదెల మండలం, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో చేపట్టిన సర్వే ప్రక్రియను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో పూజలు చేశారు. స ర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు వకీల్, శంకర్, రామ్మోహనాచారి, నాగార్జున, అజీమ్, రాజేందర్, స తీశ్, యాకయ్య, తిరుపతి, భాస్కర్, సుమన్, సురేశ్, గోవర్ధన్, శ్రీధర్ పాల్గొన్నారు.
గ్రామాల్లో సర్వే తనిఖీ
రామగుండం: అంతర్గాం మండలం ఆకెనపల్లి లో చేపట్టిన రైతుభరోసా, రేషన్‌కార్డుల దరఖాస్తుల సర్వే తీరును అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రవీందర్ పటేల్ శనివా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండల వ్యవసాయాధికారి సతీశ్, నాయబ్ తహసీల్దార్ సతీశ్‌రావు, సర్వే యర్లు సురేశ్, కృష్ణ, గిర్దావర్లు పాల్గొన్నారు.
సాంకేతికత వినియోగించాలి
గోదావరిఖని: చోరీల నివారణకు ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూ చించారు. పోలీస్ కమిషనరేట్‌లో శనివారం యాంటీ థెఫ్ట్ అలారం లాక్, యాంటీ థెఫ్ట్ అ లారం డోర్స్, విండోస్ గురించి వివరించారు. చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అ డిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఆర్‌బీ సీఐ సతీశ్, ఆర్‌ఐ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి టోర్నీకి ఎంపిక
రామగుండం: స్థానిక అయో ధ్యనగర్‌కు చెందిన టీజీ ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగి మద్ధి అన్వే ష్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యా రు. ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో ఆలిండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి టోర్నీ కి అన్వేష్ హాజరవుతారు. ఆయనను సీనియర్ కోచ్‌లు ఎండీ మునీర్‌అలీ, అప్పల నాయుడు, రాజ్‌కుమార్, పిల్లి రాజు, ఏఈ మహేందర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
రూ.వేయి కోట్లతో అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.వేయి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. జిల్లా కేంద్రంలో 368 మంది లబ్ధిదారులకు శనివారం ఆయన రూ.1.2 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించా రు. అనంతరం టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా పను లు పూర్తిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, మేనేజర్ శివప్రసాద్, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment