శిక్షణ పూర్తికాగానే ఉద్యోగం
పెద్దపల్లిరూరల్: కాలం మారుతోంది.. పోటీ పెరుగుతోంది.. నైపుణ్యానికే పెద్దపీట లభిస్తోంది.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఇప్పుడిదే అత్యంత కీలకంగా మారుతోంది.. దీనిని దృష్టిలో పెట్టుకున్న సర్కారు.. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలలో అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్లు(ఏటీసీ) ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు కోర్సులు ఆఫర్ చేస్తోంది. తొలివిడతలోనే జిల్లాలోని పెద్దపల్లి, రామగుండంలో రెండు ఏటీసీలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఇప్పటికే 172 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు ఇన్‌స్ట్రక్లర్లను నియమించారు. 85వాతం టాటా కన్సల్టెన్సీ, 15శాతం ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు చూసుకునేలా కార్యాచరణ రూపొందించారు.
ఫిబ్రవరిలో అందుబాటులోకి భవనం..
పెద్దపల్లి, రామగుండం ఐటీఐల ఆవరణల్లో 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో దాదాపు రూ.5కోట్ల వ్యయంతో ఏటీసీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇవి చివరిదశకు చేరాయి. ఏటీసీ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆరు కోర్సుల్లో చేరిన 172మంది విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణ ఇస్తున్నారు. అందుకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులోకి వచ్చింది.
మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా..
ఏటీసీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత అప్రెంటిషిప్ ఇప్పిస్తారు. ఆ తర్వాత ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించారు. యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలనేది ప్రభుత్వ ధ్యేయం. అందుకే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ ఇప్పించి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్లాన్ చేసింది.
ఏటీసీలుగా ప్రభుత్వ ఐటీఐలు
చివరిదశలో అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్ల నిర్మాణం
ఆరు కోర్సులు.. 172 సీట్లకు అనుమతి
ఈ ఏడాది నుంచే విద్యార్థులకు తర్ఫీదు
ఏటీసీ అందించే కోర్సులు, సీట్లు
కోర్సు సీట్లు
అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మిషనింగ్ టెక్నీషియన్ 24
ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్ 20
బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ 24
ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్
మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 40
మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 40
మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ 24
Comments
Please login to add a commentAdd a comment