గ్రామీణ క్రీడల్లో రాణించాలి
పెద్దపల్లిరూరల్: గ్రామీణ యువత క్రీడా పోటీల్లో రాణించాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూ చించారు. హన్మంతునిపేటలో తిరుపతిరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో వి జేత జట్లకు ఆయన జ్ఞాపికలు, నగదు అందజేసి మాట్లాడారు. నాయకులు సుధాకర్‌రావు, తీగల సదయ్య, గుజ్జుల కుమార్, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు సంతోష్, సతీశ్, వాసు, శ్రీనివాస్, మహేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆటవిడుపు
స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే విజయరమణారావు వాకర్స్‌తో ముచ్చటిస్తూ ఉల్లాసంగా గడిపారు. మైదానంలో ట్రాక్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వాకర్స్ కోరగా.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణారా వు అన్నారు. పట్టణంలో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఎ న్నికలకు ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి చి త్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్లు ప్రకాశ్‌రావు, స్వరూప, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment