గోదావరిఖని: ఛత్తీస్‌గఢ్‌లోని మారేడుపాక అడవు ల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. స్థానిక ఐఎఫ్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బూటకపు ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు నేత బడే దామోదర్‌తోపాటు 17 మంది మావోయిస్టులను హతమార్చారని ఆయన ఆరోపించారు. 2026 వరకు విప్లవ సంస్థలను ని ర్మూలిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటివరకు 264మందిని ఎన్‌కౌంటర్లలో పోలీసులు హత్య చేశా రని ఆయన ఆరోపించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, నాయకులు ఇ.నరేశ్, రామకృష్ణ, దుర్గయ్య, రాజేశం, రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment