మల్యాల(చొప్పదండి): భార్యను అదనపు వరకట్నం కోసం వేధిస్తున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీకి చెందిన పొలవేణి జయకృష్ణ–నివేదిత దంపతులు. మద్యానికి బానిసైన జయకృష్ణ అదనంగా కట్నం తీసుకురావాలంటూ భార్యను తరచూ వేధిస్తున్నాడు. ఈ నెల 20న ఆమైపె దాడి చేయడంతో గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం జయకృష్ణపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
క్రిమిసంహారక మందు తాగి ఇంటికి నిప్పు
● బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ఇల్లందకుంట(హుజూరాబాద్): క్రిమిసంహారక మందు తాగిన ఓ వ్యక్తి తన ఇంటికి నిప్పు పెట్టిన ఘటన ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన చందగల్ల సాంబయ్య మంగళవారం తెల్లవారుజామున క్రిమిసంహారక మందు తాగి, ఇంటికి నిప్పు పెట్టాడు. గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేయడంతో సీఐ కిశోర్, ఎస్సై రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి, మంటలు ఆర్పివేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని పోలీస్ వాహనంలో హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా, సాంబయ్య భార్య ఇటీవలే అతనితో గొడవపడి, హైదరాబాద్‌లోని కూతురు వద్దకు వెళ్లినట్లు సమాచారం.
వ్యక్తి మృతికి కారణమైన నలుగురి అరెస్ట్
వేములవాడ: ఇటీవల వేములవాడ పట్టణం భగవంతరావునగర్‌కు చెందిన ఎస్కూరి రాజేందర్, దుర్గం రాజేందర్, దుర్గం శంకరయ్యపై మద్యం మత్తులో నలుగురు విచక్షణారహితంగా దాడి చేయగా, బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఎస్కూరి రాజేందర్ చికిత్స పొందుతూ ఈనెల 18న చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్ మృతికి కారకులైన పట్టణానికి చెందిన కోగిల నగేశ్, గుగులోతు రాకేశ్, ఎడెల్లి హర్షక్, వంగల మంజునాథ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment