సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ కౌంటర్
మూసీ ప్రక్షాళన, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ
సాక్షి, హైదరాబాద్: సంవత్సరంలో కేసీఆర్ పేరును మరిచిపోయేలా చేస్తానని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ చరిత్ర అంటేనే కేసీఆర్ అని వ్యాఖ్యానిస్తూ రేవంత్‌రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య ఉన్న తేడాలను పోలుస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశా డు.. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు..
ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశా డు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు! నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు.. ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోశాడు’ అని పేర్కొన్నారు. చిట్టినాయుడూ... నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అని ఎద్దేవా చేశారు.
ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు..
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణ యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలుస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారపట్టారు. మూసీ ప్రక్షాళన, ధాన్యం కొను గోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వ్యాఖ్యా నించారు. ఈ మేరకు ట్వీట్ ఇలా సాగింది. ‘మూసీపై ముందుకు– కొనుగోళ్లపై వెనక్కు, రామన్నపేటకు రైరై – కొనుగోలు సెంటర్లకు నైనై, దామగుండం ధనాధన్– ధాన్యం కొనుగోళ్లు ఢాంఢాం, కొనుగోళ్లకు దిక్కులేదు –కాంగ్రెస్ కోతలకు లెక్క లేదు, దళారులకు దండిగా – రైతన్నలకు దండగ ’అని ప్రాసలతో కవితాత్మక ధోరణిలో విమర్శించారు. ఎద్దేడ్చిన ఎవుసం – రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని వ్యాఖ్యానించారు.
10 నెలల్లో ఎవరికోసం అంత రుణం?
నమ్మి నానబొస్తే... పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ పాలన అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మే రకు ‘ఎక్స్’లో ట్వీట్ చేస్తూ ప్రభుత్వం తీసుకుంటు న్న అప్పులపై ధ్వజమెత్తారు. 60ఏళ్ల సమైక్య పాల కులకన్నా పది నెలల్లోనే అధిక రుణం ఎవరి కోసం? పదేళ్లలో సాధించిన ప్రగతికన్నా పది నెలల్లో ఏం సాధించారని ఈ అప్పులు? అని ప్రశ్నించారు.
సీఐ దాడి ఘటనపై సీరియస్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై వాట్సాప్ ద్వారా ప్రశ్నించిన మహబూబ్ నగర్ కు చెందిన భాస్కర్ ముదిరాజ్‌ను స్థానిక సీఐ అప్పయ్య బెల్ట్‌తో కొట్టిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి అడిగి తెలు సుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపుల కు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయపరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment