‘ఒకడు మైలవరం మాయలోడు.. ఇంకోడు ఉప్మాగాడు!’ | Sakshi
Sakshi News home page

‘ఒకడు మైలవరం మాయలోడు.. ఇంకోడు ఉప్మాగాడు!’

Published Tue, May 7 2024 8:03 AM

ఇటీవల చేతులు కలిపిన వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమ (ఇన్‌సెట్‌లో) ఓ టీవీ చానల్‌లో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న ఉమ, కృష్ణప్రసాద్‌

ఎవరు నిఖార్సయిన నాయకుడో మాకు తెలియాలి

ఓటు వేయాలో, వద్దో మేం నిర్ణయించుకుంటాం

వసంత, దేవినేనిలను నిలదీస్తున్న మైలవరం ఓటర్లు

పేదలు, వెనుకబడివన వర్గాల వారంటే మీకు అంత అలుసా?

దేవినేని: వసంత రాజకీయ వ్యభిచారి. 
వసంత: ఉమ ఒక లుచ్చా. లఫంగి. జీవన్మృతుడు. 

దేవినేని: వాడొక పందికొక్కు. తోడేలు. ఇసుకాసురుడు.  
వసంత: ఆ వెధవొక బురదపంది. శవాల వెంట చిల్లర పెంకులు ఏరుకునే సన్నాసి. ప్లాట్‌ ఫారంగాడు. నీ అయ్య ఒక సోడాబుడ్డి. 0.01 సెంటు పట్టా ప్రభుత్వం ఇస్తే బతికినోడివి. ఎలా పైకి వచ్చావో, రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు.  

దేవినేని: కిట్టప్రసాద్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు కొట్టేసి విల్లాలు, అపార్టుమెంట్లు కట్టినోడు. డబ్బు ఉందనే అహంకారి.  
వసంత: నేను కిట్టప్రసాద్‌ అయితే వాడు ఉమాగాడు. ఉమక్కాయ్‌గాడు. ఉప్మాగాడు. లంగాహరి, భగవాన్‌దాస్‌. పోరంబోకు.  

దేవినేని: ఇప్పుడు కులం (కమ్మ) గుర్తుకొచ్చి కులానికి మద్దతుగా అబ్బా (నాగేశ్వరరావు) కొడుకులిద్దరూ సన్నాసుల్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి నన్ను హత్య చేయిస్తానన్నాడు.  
వసంత: మతి తప్పి మాట్లాడుతున్నాడు. నేను కడప రౌడీలను తీసుకొచ్చి హత్య చేయిస్తానంటే నువ్వు మంత్రివి. నీ నాయకుడు సీఎం. మరి ఏం పీకారు అప్పుడు. 

దేవినేని: కిట్టప్రసాద్‌ తండ్రి నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం, ఆర్టీసీ డైరెక్టర్‌ పదవి కోసం జై ఆంధ్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడు. నేడు ఇతను అమరావతి రాజధానిని తాకట్టు పెట్టాడు. బయటి వ్యక్తులతో మైలవరంలో ఒక దళితుడి మీద, ఒక మైనారిటీ వ్యక్తి మీద దాడి చేయించాడు.  
వసంత: అరే నీ అయ్య, నీ బాబు సినిమా హాల్లో ఆడోళ్లకి టికెట్‌లు ఇచ్చే దగ్గర వెకిలి వేశాలు        వేసినోడు. నా బాబు మాజీ హోం మంత్రి రా. గుర్తుపెట్టుకో.  

దేవినేని: కొండపల్లి బొమ్మలకు ముడి సరుకు కోసం వాడే పునికి చెట్లను వందల ఎకరాల్లో తొలగించి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్న దొంగోడు. 
వసంత: చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా ఎలా మారిందో అలా ఉమాకి మైలవరం నియోజకవర్గంలో క్రషర్‌లు, క్వారీలు ఏటీఎంలా మారాయి. క్రషర్‌లు, క్వారీల యజమానులపై కేసులు పెట్టించి బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన దొంగ. 

దేవినేని: మట్టి, ఇసుక, వీటీపీఎస్‌ డస్టుని దోచుకున్న మైలవరం వీరప్పన్‌. కిట్టప్రసాద్‌. రూ.వందకోట్లు ఇచ్చి మరీ టీడీపీలో చేరుతున్నాడు. 
వసంత: మైలవరం మాయలోడు. హత్యారాజకీయాలు అతని నైజం.


సాక్షి ప్రతినిధి, విజయవాడ/ జి.కొండూరు :  ఇలా మాట్లాడుకుంది మతి తప్పిన వాళ్లో, మద్యం తాగేసి విచక్షణ కోల్పోయిన ఇద్దరో, వీధి రౌడీలో, గూండాలో కాదు. ఒకరేమో ఇంజినీరింగ్‌ చేశారు. మరొకరు పదో తరగతి వరకు చదివారు.  

ఇద్దరూ ఇద్దరే...   
..దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. నందిగామ, మైలవరం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఏళ్ల తరబడి కొనసాగారు. సొంత సోదరుడు దేవినేని వెంకట       రమణ సైతం మాజీ మంత్రే. వసంత వెంకట కృష్ణప్రసాద్‌ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్‌ పోటీలో ఉన్నారు.

నందిగామ నుంచి మైలవరం వరకు...   
..దేవినేని, వసంత కుటుంబాల రాజకీయాలు నందిగామలో మొదలయ్యాయి. ఎన్నికల్లో తలపడ్డాయి. ఆ స్థానం రిజర్వుడు కావడంతో మైలవరం చేరాయి. ఉమా సోదరుడు దేవినేని వెంకటరమణ, కృష్ణప్రసాద్‌ తండ్రి వసంత నాగేశ్వరరావు ఇద్దరూ టీడీపీ నుంచి గెలుపొంది మంత్రి పదవులు నిర్వర్తించిన వారే. వారసత్వంగా మైలవరం చేరుకున్న ఉమ టీడీపీ నుంచి, కృష్ణప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యరి్థగా 2019 ఎన్నికల్లో పోటీపడ్డారు. 

వసంత విజయం సాధించారు. అంతకుముందు రాజకీయంగా ఎవరేమి అనుకున్నప్పటికీ.. గత 55 నెలల వ్యవధిలో రాజకీయాలను ఎంతగా భ్రష్ఠుపట్టించారో, పరస్పరం ఎంత హీనంగా మాట్లాడుకున్నారో వివిధ సందర్భాలే గుర్తు      చేస్తాయి. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చెప్పలేనన్ని. చెప్పుకోలేనన్ని. ఇద్దరూ ఎంతెంత అవినీతిపరులో, ఎంతటి అక్రమార్కులో వారంతట వారు మీడియా ఎదుట వెల్లడించినవే నిదర్శనాలు. ఇప్పటికీ అవన్నీ ఆడియోలు, వీడియోల రూపంలో ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేసులు పెట్టుకోవడం పరాకాష్ఠ. 

నాయకులు, కార్యకర్తలే బకరాలా?  
..మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు వసంత, దేవినేనిలకు అప్పుడు, ఇప్పుడు బకరాల్లా కనిపిస్తున్నట్లుంది. వైఎస్సార్‌ సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది ఆ పారీ్టకి వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం టీడీపీ మైలవరం అభ్యరి్థగా ఎన్నికల బరిలో ఉన్న వసంత ఇరుపారీ్టల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. డబ్బు ఉందనే అహంకారంతో పేదలు, బడుగువర్గాల ఓటర్లను కొనుగోలు చేసేయవచ్చనే అంచ నాలతో ఇష్టారీతిన ప్రలోభాలకు ప్రయతి్నస్తున్నారు. నోట్ల కట్టలను పరిచేయవచ్చనే భావజా  లంతో తమను చిన్నచూపు చూస్తున్నారని స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు.  

రాజకీయం కోసం దేనికైనా.. ఎంతవరకైనా.. 
..గడిచిన ఐదేళ్లలో వసంత, దేవినేని ఆయా పారీ్టల నాయకులను, కార్యకర్తలను తమ ఇష్టానుసారం వాడేసుకున్నారు. ఇప్పుడు తామిరువురం ఒక్కటేనని చేయిచేయి కలుపుకొని, పచ్చ చొక్కాలు తొడుక్కుని అదే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఉమ్మడిగానూ మాట్లాడుతున్నారు. పైగా వసంతను గెలిపించాలని దేవినేని ఉమా అభ్యరి్థస్తుండటమే అత్యంత హాస్యాస్పదమని, ఇంతకన్నా దివాళాకోరుతనం ఉంటుందా? అని ఇరువర్గాల నాయకులు నోరెళ్లబెడుతున్నారు. మనిషన్నాక కాస్త అయినా సిగ్గూ శరం ఉంటుందని వీరికి అలాంటి వేమీ లేవని స్వపక్షీయులే అసహ్యించుకుంటు న్నారు. ‘ఉమా మా నాయకుడని, మాకు అత్యంత సన్నిహితుడని చెప్పుకోవడానికి మాకిప్పుడు        సిగ్గేస్తోంది. 

వాళ్ల అన్నయ్య వెంకటరమణ స్నేహితులుగా గడచిన అన్ని ఎన్నికల్లో ఉమకు తోడుగా నిలిచాం. అన్నిటికీ తెగించి తలపడ్డాం. ఉమ్మడిగా కష్టపడ్డాం. గెలిపించాం కూడా. ఇలా నేను ఒక్కడినే కాదు. పది మందికి పైగా మేమంతా జట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరం ఉమ వెంట నడవడం లేదు. పార్టీ కూడా అతనికి సీటు ఇవ్వలేదులెండి’ అని విజయవాడ గాయత్రీనగర్‌లో        ఉంటున్న వారు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటి వరకు ఉమ ఒక్కడినే తప్పుడోడు అనుకున్నాం. అతనికన్నా పనికిమాలిన వాడు, పచ్చిమోసగాడుగా వసంత కనిపిస్తున్నాడు’ అని ముక్తాయించారు. గత ఐదేళ్లలో పారీ్టని, కులాన్ని అడ్డుపెట్టుకుని చాలా అరాచకాలే చేశాడు. 

ఇప్పటికి వైఎస్సార్‌ సీపీకి కృష్ణప్రసాద్‌ అనే చీడ పోయిందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. వారిద్దరి గురించి మా వద్ద చాలా విషయాలు, వివరాలే ఉన్నాయని, అటు వెళ్లడానికి ఇష్టంలేకే ఇప్పుడు విజయవాడ నగరంలో, ముఖ్యంగా వెస్ట్‌లో పార్టీ తరఫున తిరుగుతున్నాం. మైలవరాన్ని విడిచి ఇలా రావాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదని పంటకాలవ ప్రాంతంలోని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. మేం అంతా టీడీపీ వీరవిధేయులమైనప్పటికీ మైలవరం ఓటర్లు వసంతకు తగిన       బుద్ధి చెప్పాలని, ఉమకు ఇంకా గుణ పాఠం నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని  అభిప్రాయపడటాన్ని చూస్తుంటే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమల స్థితిగతులు ఎలాంటివో తేటతెల్లమవుతున్నాయి.

Advertisement
 
Advertisement