సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా పార్టీల మధ్య పొత్తుల సయోధ్య కుదరడం లేదు. ఒకవైపు కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపిన సీపీఎం దానికి బ్రేకప్ చెప్పింది. కాంగ్రెస్‌తో సయోధ్య కుదరకపోవడంతో 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు సీపీఎం ప్రకటించింది.
ఇదిలా ఉంచితే, జనసేన-బీజేపీ పొత్తు అంశం తెలంగాణలో మరింత హీట్‌ను పుట్టిస్తోంది. నాగర్ కర్నూల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. తన అనుచరులతో కలిసి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి దిలీపాచారి నిరసనకు దిగారు. ‘ ‘జనసేన వద్దు.. బీజేపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన అసలు తెలంగాణలోనే లేదని అలాంటప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దిలీపాచారి.
Comments
Please login to add a commentAdd a comment