సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్త ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది.
వివరాల ప్రకారం.. బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సారధిగా కిషన్‌రెడ్డి ఉన్నారు. ఇక, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కోసం పది కమిటీలను బీజేపీ వేసింది. పది కమిటీలతో కిషన్‌రెడ్డి నేడు, రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. మరోవైపు, బీజేపీ మళ్లీ చేరికల సమన్వయ కమిటీని వేసింది. ఇక, చేరికల కమిటీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఉన్నారు.
ఇక, కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే, ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment