సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంత నిజాయితీపరుడతైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని?.. మోహన్‌బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని?.. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్‌లో కొన్ని విషయాలు ఉన్నాయని.. నార్కో టెస్టులో పాసై బయటకు రావాలంటూ చంద్రబాబుకు పోసాని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
జైల్లో ఉన్నప్పుడు కూడా తన భర్త ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని నారా భువనేశ్వరి చెబుతున్నారు. మరి అంతటి నిజాయితీపరుడు.. హెరిటేజ్‌ను మోహన్‌బాబు నుంచి ఆరు నెలల్లో ఎందుకు లాక్కున్నారు?. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా?. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్‌లో ఉంది. నా ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
జయప్రదను ఎలా అవమానించారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పెట్టిన మంచి పథకాలన్నింటిని.. సీఎం అయ్యాక చంద్రబాబు నాశనం చేశాడు. ఇప్పుడు సీఎం అవ్వడానికి ప్రపంచంలో లేని పథకాలన్నింటిని ప్రవేశపెడతామంటున్నారు. అని పోసాని మండిపడ్డారు.
చేసిన అవినీతి పబ్లిక్ డొమైన్‌లో ఉంటే ఓట్లు ఎలా వేస్తారు?. నా ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) సీఎం అవుతారు. ఓ కమ్మోడీగా మీ కోసం పాదయాత్ర చేస్తా. కమ్మ ఓట్లన్నీ మీకే పడతాయి. 175 సీట్లు మీకే వస్తాయి. మీరే సీఎం అవుతారు. నా ప్రశ్నలపై సమాధానాలకు మీరు సిద్ధమా?.. ఎనీ వేరే.. ఎనీ ప్లేస్.. నార్కో అనాలసిస్ టెస్టుకు చంద్రబాబు సిద్ధమా? అని పోసాని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment