సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
వారిని నిర్బంధించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమే
పోలీసుల అధికార దుర్వినియోగం క్షమార్హం కాదు
వీటిని ఆపకపోతే హక్కుల పరిరక్షణకు చట్టపరంగా చర్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ప్రోద్బలంతో రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన ‘‘ఎక్స్’’ ఖాతాలో తీవ్రంగా ఖండించారు. దీన్ని తక్షణం ఆపకుంటే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం అంటే వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే.. రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేయడమే.
టీడీపీ నాయకుల ప్రభావంతో, రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి, కస్టడీలో వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. పోలీసుల అధికార దుర్వినియోగం క్షమించరానిది.
భావవ్యక్తీకరణ హక్కులకు విరుద్ధమైనది. ఈ రాజకీయ ప్రేరేపిత చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని తక్షణమే ఆపకుంటే సోషల్ మీడియా కార్యకర్తల హక్కులను పరిరక్షించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోం’’ అని హెచ్చరించారు.
Detaining Social Media activists is infringing their fundamental rights and a direct assault on the Constitutional guarantee. These politically motivated arrests of social media activists and their ill treatment in the custody, driven by the influence of @JaiTDP leaders, is a…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2024
Comments
Please login to add a commentAdd a comment