ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళా నాయకులు
ఒంగోలు: ఇటీవల వైఎఎస్సార్ సీపీ నుంచి పదవులు పొందిన మహిళా నాయకులు గురువారం శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని సత్కరించారు. 2024 సాధారణ ఎన్నికలకు కష్టపడి పనిచేసి పార్టీ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి గెలుపు కోసం కృషిచేస్తామని బాలినేనికి తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జి బడుగు ఇందిర, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, ఉపాధ్యక్షురాలు బత్తుల ప్రమీల, జల్లిపల్లి సుబ్బులు, ప్రధాన కార్యదర్శి సాదం లక్ష్మి, కార్యదర్శులు నగబోతుల నిర్మల, చీమలదిన్నె గృహలక్ష్మి, కావూరి సుశీల, సంయుక్త కార్యదర్శులు పిడుగురాళ్ల కోటేశ్వరమ్మ, షేక్ సగీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment