ఇది మోసపూరిత బడ్జెట్
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రకాశం జిల్లాకు ఒరిగిందేమీ లేదని, ఈ బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని.. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సోమవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. మార్కాపురంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి నిధులు ఏవని ప్రశ్నించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల కేటాయింపు శూన్యమన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి, ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.4500 కోట్లు కేటాయించినట్లు చూపించి, అందులో వెయ్యి కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి, రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి కేటాయించారన్నారు. కేవలం రూ.వెయ్యి కోట్లతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయిస్తే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇచ్చే పరిస్థితి లేదని, తల్లికి వందనం ఎగనామం పెట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు లేకపోతే పథకం లేనట్టేనా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment