కోడిగుడ్ల ధర ఎన్నడూ లేని విధంగా పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.7.50కు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం 30 గుడ్ల ట్రే ధర రూ.130 ఉండగా నేడు రూ.210 పలుకుతోంది. కూరగాయలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జిల్లాకు కోడి గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఆగస్టులో గుడ్డు ధర రూ.5.70 ఉండగా అది నేడు రూ.7.50కి చేరింది. బలవర్థకమైన పౌష్టికాహారం కావడంతో ఎక్కువ శాతం మంది గుడ్డును ఉపయోగిస్తున్నారు. బేకరీ ఫుడ్స్, నూడిల్స్ స్టాల్స్, రెస్టారెంట్లలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment