విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మద్దిపాడు: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మద్దిపాడు మండలంలోని దొడ్డవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోరబోయిన పాపారావు (30) వృత్తిరీత్యా కరెంటు పనులు చేస్తుంటాడు. శుక్రవారం తన పొలంలోకి నీరు పెట్టేందుకు చెరువు గట్టునున్న మోటార్‌ను రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టి చెరువు లో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పాపారావు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
స్థల వివాదం కేసులో నిందితులకు శిక్ష
నాగులుప్పలపాడు: మండలంలోని మాచవరం గ్రామంలో ఓ స్థల వివాదం కేసులో నిందితులకు శిక్షపడినట్లు స్థానిక ఎస్‌ఐ బి.శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాల మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన మర్రావుల సుబ్బారావు అతని భార్యతో కలిసి 2018లో వారి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి గుంతలు తీస్తుండగా, అదేగ్రామానికి చెందిన మర్రావుల శ్రీనివాసరావు, అతని భార్య పార్వతి, కుమార్తె లక్ష్మి అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. గుంతలు తీయవద్దని గొడవకు దిగి సబ్బారావు, అతని భార్యపై దాడి చేయగా వారికి తీవ్రగాయాలై ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అప్పటి ఎస్‌ఐ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ పూర్తవగా, ఒంగోలు జేఎఫ్‌సీఎం ఎకై ్సజ్ కోర్టు జడ్జి కోమలివల్లి ఏ–1కు రెండేళ్ల జైలు, రూ.7 వేల జరిమానా, ఏ–2కు రూ.2 వేలు, ఏ–3కి రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్‌ఐ వివరించారు.
ఆక్రమించింది
బస్‌షెల్టర్ స్థలమే..
బేస్తవారిపేట: మండల కేంద్రమైన బేస్తవారిపేటలో సర్వే నంబర్ 283/1లో బస్‌షెల్టర్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 20 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ టీడీపీ నాయకుడు ప్రయత్నించినట్లు అధికారులు నిర్ధారించారు. శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ ఏఈ టి.వెంకటేశ్వర్లు సమక్షంలో సర్వేయర్ సురేష్, వీఆర్వో ఇండ్లా శేఖర్‌రెడ్డి బస్ షెల్టర్ స్థలాన్ని కొలతలు వేశారు. ఆ 20 సెంట్ల స్థలంలోనే కొంతమేర ఆక్రమించేందుకు చిల్లకంప తొలగించడంతోపాటు మెరక తోలారని గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థలానికి హద్దులు గుర్తించిన ఆర్టీసీ అధికారులు చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం చంద్రశేఖర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్పేక్టర్ రామానాయక్ పాల్గొన్నారు. కాగా రూ.లక్షల విలువైన స్థలాన్ని కబ్జాకోరుల పాలుకాకుండా ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నర్సింగ్ వృత్తి పవిత్రమైనది
● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు
ఒంగోలు టౌన్: నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, అత్యంత నిబద్ధత, సహానుభూతితో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ సీటు లభిస్తుందని, వృత్తిలో రాణించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ సమయంలో డాక్టర్లు, సిబ్బంది సహకారంతో విజ్ఞానాన్ని పెంపొదించుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున సూచించారు. సేవలందించే సమయంలో స్నేహపూర్వకంగా ఉంటే రోగులు త్వరగా ఉపశమనం పొందుతారని చెప్పారు. అనంతరం విద్యార్థులకు యాప్రాన్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, ఆర్‌ఎంఓ మాధవీలత, డిప్యూటీ సూపరింటెండెంట్లు నామినేని కిరణ్, డి.ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment