ఔరంగబాద్ సర్పంచ్ కళావతి మృతి
కంభం: మండలంలోని ఔరంగబాద్ గ్రామ సర్పంచ్ వరికుంట్ల కళావతి(58) శుక్రవారం మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఔరంగబాద్ సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వగ్రామంలోనే శనివారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి హాజరై కళావతి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, నాయకులు రసూల్, వరికుంట్ల పెద్దకోటేశ్వరరావు, చేగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, హుస్సేన్‌బాష, సబ్బసాని సాంబశివారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నివాళులర్పించారు.
వైఎస్ జగన్ కటౌట్ల తొలగింపు అమానుషం
కంభం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కటౌట్‌ను తొలగించడం అమానుషమైన చర్య అని కంభం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి పేర్కొన్నారు. అభిమానంతో తాను ఏర్పాటు చేసిన కటౌట్లను తాడేపల్లి మున్సిపల్ అధికారులు అనుమతి లేదంటూ తొలగించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాధరణను ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పేపరు లీకవకుండా చూడాల్సింది ప్రభుత్వమే..
● యూటీఎఫ్ నేతల డిమాండ్
ఒంగోలు సిటీ: పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూసుకోవడం పూర్తిగా ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం భవిష్యత్‌లో పరీక్ష పేపర్లను పాఠశాలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం కళ్లు తెరవాలని, అలాగే ప్రభుత్వ అధికారులు కక్ష పూరిత ధోరణి మానుకోవాలని జిల్లా శాఖ తరపున డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో పనిచేస్తున్న సిద్ధయ్య శెట్టి ప్రశ్నపత్రాలను పాఠశాలకు తీసుకువెళ్తూ మధ్యాహ్నం రంగంపేట వద్ద ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమన్నారు. సిద్ధయ్యశెట్టి తలుపులపల్లి జెడ్పీ హైస్కూల్లో బయలాజికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ తరఫున ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అదుపుతప్పిన ప్రైవేట్ స్కూల్ బస్సు
సింగరాయకొండ: ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం సింగరాకొండ–పాకల రోడ్డులో చోటుచేసుకుంది. ఎంఇఓ కత్తి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. భాష్యం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాకల వెళ్లి 12 మంది విద్యార్థులను తీసుకుని సింగరాయకొండ వస్తూ అదుపుతప్పింది. విద్యార్థులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఎంఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment