మస్తాన్‌వలికి భారత్ బిజినెస్, స్మెబిజ్ అవార్డ్‌లు
తాళ్లూరు: ఢిల్లీ వేదికగా ఈ నెల 21న జరిగిన భారత్ బిజినెస్ 2024 అవార్డు, స్మెబిజ్ ఐకాన్ స్టార్ 2024 అవార్డులను తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌వలి అందుకున్నారు. మస్తాన్‌వలి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ పే సీఈఓ అష్రిర్ గ్రోవర్ చేతుల మీదుగా శనివారం ఈ అవార్డులను అందుకున్నారు. మస్తాన్‌వలి మొదటిగా డెక్కన్ క్లాప్ పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. దేశంలో 16 ప్రధాన నగరాల్లో 30 వేల మంది ఇంటి యజమానులకు పెయింట్, వాటర్‌ప్రూఫింగ్ సంబంధిత సర్వీస్ అందిస్తున్నారు. ఈ విధానంపై ఇండియాలోని టాప్ 5 పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్ ట్రైనర్స్‌లో ఒకరిగా మస్తాన్‌వలిని గుర్తించి ఈ అవార్డులు ఇచ్చారు.
అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్: అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ప్లంబర్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తారన్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు ఒంగోలు లోని ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రం, స్కిల్ హబ్ సెంటర్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. శిక్షణ జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇతర పూర్తి వివరాలకు 9652282636 అనే నంబరుపై సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment