జాతీయ స్థాయి ఎయిర్ పిస్టల్‌లో ప్రణవికి రెండు రజతాలు
కొత్తపట్నం: ఢిల్లీలో ఈ నెల 21న జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామ పంచాయతీ వలసపాలేనికి చెందిన ద్వారం ప్రణవి, గుంటూరు జిల్లాకు చెందిన ముకేష్ జోడీ రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగం సీనియర్, జూనియర్ కేటగిరీలో ప్రణవి, ముకేష్ జోడీ రెండో స్థానంలో నిలిచారు. సీనియర్ విభాగంలో ప్రణవి–ముకేష్ ధ్వయం 577 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. జూనియర్ విభాగంలో ఈ జోడీ 576 పాయింట్లతో రజితంలో మెరిసింది. ఇద్దరు కలిసి ఆంధ్రకు మంచి పేరు తెచ్చారు. ఇంతకు ముందు ప్రణవి అనేక స్వర్ణ పతకాలు సాధించింది. సీకే చౌదరి కోచ్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రణవి తండ్రి ద్వారం జాలిరెడ్డి, డీవీ రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment