మహిళా పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్:
మహిళా పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మహిళా పోలీసు అసోషియేషన్ క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంఘా స్పందించారు. సైబర్ క్రైమ్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయాలన్నారు.
కార్యక్రమంలో మహిళా పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆత్మూరి కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల యామిని, రాష్ట్ర సహాయ కార్యదర్శి అరుణ ప్రణతి, అసోసియేషన్ సభ్యులు షేక్ షాహినా, కె. జ్యోతి, అనూష, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment