సీఎస్‌పురం (పామూరు): ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపి వారిని అడ్డుతీయబోయిన మహిళా సర్పంచ్‌ను టీడీపీ నాయకులు దూషించి అవమానించారు. ఈ సంఘటన కోవిలంపాడులో మంగళవారం జరిగింది. సర్పంచ్ షేక్ ఖాదర్‌బీ కథనం ప్రకారం.. కోవిలంపాడులో షేక్ ఖాదర్‌వలి, షేక్ ఇమామ్ హుస్సేన్‌లు ఇటీవల ఇంటి పనులు ప్రారంభించారు. షేక్ రజ్జబ్ బాషా, షేక్ ఖలీల్, షేక్ నాయబ్ రసూల్ వారిని ఇబ్బందులు పెడుతున్నారు. ఆ పట్టా భూములను మంగళవారం రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తుండగా షేక్ నాయబ్ రసూల్‌కు షేక్ ఖాదర్‌వలిల మధ్య వివాదం జరిగింది. ఉదయం సుమారు 10.45 గంటల సమయంలో షేక్ నాయబ్ రసూల్, షేక్ రజ్జబ్ బాషా, షేక్ ఖలీల్ స్థలం మీకు ఎక్కడిదిరా అంటూ షేక్ ఖాదర్‌వలిపై దాడి చేస్తున్నారు. సర్పంచ్ ఖాదర్‌బీ ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి ఖలీల్ అనే వ్యక్తి తనతో గొడవకు వచ్చి దూషిస్తూ అవమాన పరిచాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment