ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక పోలీసుస్టేషన్ తనిఖీకి వచ్చిన ఎస్పీని ఎమ్మెల్యే కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పలు పరిస్థితుల గురించి ఆయన చర్చించారు. పక్షపాతం లేకుండా కేసులు దర్యాప్తు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎమ్మెల్యే తాటిపర్తి కోరారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షుడు కె.ఓబులరెడ్డి, ఎస్.పోలిరెడ్డి, ఏకుల ముసలారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాస్, డి.సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, షేక్ వలి, పి.రామాంజనేయరెడ్డి, టి.ఆవులయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment