ఇంటికి కన్నం
● పెద్దదోర్నాలలో దొంగల చేతివాటం
● విలువైన బంగారం మాయం
పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని శ్యామణి కుమార్ వీధిలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విలువైన బంగారు అభరణాలతో పాటు 5 వేల రూపాయల నగదు మాయమైనట్లు బాధితుడు పాల్తి రాజేష్‌నాయక్ వాపోయాడు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన నాయక్ మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం కోసం జిల్లా కేంద్రంలోని క్లూస్ టీంను రంగంలోకి దించారు. దొంగతనానికి సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌లోని శ్యామణి కుమార్ వీధిలో ప్రభుత్వ వైద్యశాలలో మేల్ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ నాయక్ కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కుమారుడి ఆరోగ్యం బాగోలేక పోవడంతో అతని భార్య వారం రోజుల క్రితం గుంటూరు వెళ్లింది. దీంతో పాటు నైట్ డ్యూటీ ఉండటంతో రాజేష్ నాయక్ కూడా మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎస్సై మహేష్ సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం చోరీ జరిగిన నివాస గృహంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. దొంగతనానికి కేసు నమోదు చేసి ధరా్య్ప్తు చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment