ఇళ్ల నిధుల మంజూరుపై హర్షం
వేములవాడఅర్బన్: మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.234.80కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు నందికమాన్ వద్ద ఆదివారం సంబ రాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాడు మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇంది రమ్మ ఇళ్లకు రూ.5లక్షలు చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇళ్లకు రూ.230కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడలోని బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనక య్య, చింతపల్లి శ్రీనివాసరావు, ఎర్రం రాజు, పండుగ ప్రదీప్, గాలిపెల్లి స్వామి, ఎర్రం సత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, దేవరాజు ఉన్నారు.
4,696 ఇళ్లకు రూ.230 కోట్లు మంజూరు చేశాం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment