డిజిటల్ డ్రోన్ సర్వే ప్రారంభం
● అమృత్ 2.0 స్కీంలోకి సిరిసిల్ల
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం సిరిసిల్లలో చేపట్టిన డిజిటల్ డ్రోన్ సర్వేను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ప్రారంభించారు. ప్రతిష్టాత్మక అమృత్ 2.0 స్కీం కింద సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందిస్తున్న నూతన మాస్టర్‌ప్లాన్‌కు సిరిసిల్ల పట్టణం ఎంపికైంది. సిరిసిల్ల నూతన మాస్టర్‌ప్లాన్ తయారీకి డిజిటల్ డ్రోన్ సర్వేను స్థానిక బతుకమ్మఘాట్ వద్ద చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది విలీన గ్రామపంచాయతీలు, సిరిసిల్ల పట్టణంలోని గుర్తించిన వివిధ లొకేషన్ పాయింట్ల నుంచి డిజిటల్ డ్రోన్ సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు వెల్దండి దేవదాసు, దార్నం అరుణ, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment