తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం రాళ్లపేటలో రైతులకు శుక్రవారం విత్తనశుద్ధిపై ప్రొఫెసర్లు అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ డాక్టర్ జె.రాజేందర్ మాట్లాడుతూ.. కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బండెజిమ్ 50 శాతం కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలన్నారు. దంప నారుమళ్లకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండెజిమ్ 50 శాతం కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకెత్తిన విత్తనాలను దంప నారుమడిలో చల్లుకోవాలని సూచించారు. రైతులకు కూనారం సన్నరకం వరి విత్తనాలను పంపిణీ చేశారు. కళాశాల ప్రొఫెసర్లు, దత్తత గ్రామ కమిటీ సభ్యులు డాక్టర్ సతీశ్, డాక్టర్ సంపత్, రాళ్లపేట మాజీ సర్పంచ్ పరశురాములు, 20 మంది రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment