No Headline
జగిత్యాల/రాయికల్/ధర్మపురి/కోరుట్లటౌన్: జగిత్యాల ఆస్పత్రిలో ఆదివారం ఎమర్జెన్సీ కేసులు అంతంత మాత్రమే వ చ్చాయి. సెలవు రోజు కావడంతో రోగుల సంఖ్య తక్కువగానే ఉంది. హౌస్ సర్జన్‌లు ఆందోళన బాటలో ఉండగా.. డ్యూటీ డాక్టర్లు విధులు నిర్వహించారు.
● రాయికల్ ఆస్పత్రిలో డాక్టర్ వాణి విధుల్లో ఉన్నారు. సుమారు 25మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుక్కకాటుతో వచ్చిన రోగుల సంఖ్య ఎక్కువగా కనిపించింది.
● ధర్మపురి ఆస్పత్రిలో ఆదివారం 13 మంది ఓపీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 15 మంది డాక్టర్లకు ఒక డ్యూటీ డాక్టర్, 13మంది నర్సులకు ఒకరు, నలుగురు హెడ్‌నర్సులకు ఒక్కరు విధుల్లో కనిపించారు. ‘ఆదివారం ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ 24గంటల పాటు అందుబాటులో ఉంటారు. మిగిలిన డాక్టర్లు అత్యవసర సమయం ఆన్‌కాల్‌లో ఉంటారు’. అని డాక్టర్ రవి వివరించారు.
● కోరుట్ల ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఓపీ, ఎమర్జెన్సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. జనరల్ వార్డులో నలుగురు, మొదటి అంతస్తులో 15మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు గర్భిణులకు వైద్యులు ప్రసూతి చేశారు.
జగిత్యాల
ఎమర్జెన్సీ.. అంతంతే
Comments
Please login to add a commentAdd a comment