‘ఇందిరమ్మ సర్వే’.. ఆఫీస్‌కు రావాలట !
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొందరు ఉద్యోగుల తీరుతో సరిగా సాగడం లేదు. దరఖాస్తుదారులు ఉంటున్న ఇంటికి స్వయంగా అధికారులు వెళ్లి సర్వే చేసి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. కానీ తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ పంచాయతీ కార్యదర్శి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 1, 2, 3, 4, 5 వార్డులలో సర్వే ముగిసిందని ఎవరికై నా సర్వే కాకుంటే సోమవారం ఉదయం 9 గంటలకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, స్థలం డాక్యుమెంట్స్ తీసుకుని గ్రామపంచాయతీ వద్దకు రావాలని గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ చేయడం చర్చకు దారితీసింది. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఖాళీ స్థలం వద్ద లబ్ధిదారుల ఫొటోలు తీయాల్సి ఉండగా అందుకు భిన్నంగా గ్రామపంచాయతీకి రావాలని మెసేజ్ పెట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోసం ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా బేగ్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment