భక్తిశ్రద్ధలతో కాలభైరవాష్టమి వేడుకలు
వేములవాడ: రాజన్న సన్నిధిలోని కాలభైరవస్వామి ఆలయంలో ఆదివారం కాలభైరవాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల బీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ప్రదోష పూజ అనంతరం కాలభైరవునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు నమిలకొండ ఉమేశ్‌శర్మ, గోపన్నగారి చందు, గర్షకుర్తి శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
24న జిల్లా స్థాయి జూడో పోటీలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నీలోజిపల్లిలో ఈనెల 24న జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాసారపు తిరుపతి, ప్రధాన కార్యదర్శి తిప్పారపు సత్యనారాయణ తెలిపారు. సబ్ జూనియర్ నేషనల్ క్యాడెట్ జూడో, సీనియర్ పురుషులు, సీ్త్రల విభాగాలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్‌జూనియర్ విభాగాలలో 2011, 2012, 2013లో జన్మించిన బాలురు, బాలికలు అర్హులు అని తెలిపారు. నేషనల్ క్యాడెట్ జూడోలో 2008, 2009, 2010లో పుట్టిన వారు అర్హులని, సీనియర్ విభాగంలో 2010కి ముందు 15 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణపత్రం జిరాక్సు ప్రతులతో నీలోజిపల్లిలో రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు 79815 26773లో సంప్రదించాలని కోరారు.
రేషన్‌బియ్యం పట్టివేత
సిరిసిల్లక్రైం: ప్రభుత్వం సరఫరా చేసే రేషన్‌బి య్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒకరిని సిరి సిల్ల టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశా రు. జిల్లా కేంద్రంలోని వెంకంపేటలో ఓ ఇంట్లో రేషన్‌బియ్యం నిల్వ చేశారన్న సమాచార ంతో సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్‌రావు తని ఖీ చేశారు. పోలీసుల తనిఖీల్లో 39 క్వింటాళ్ల బియ్యం లభ్యమయ్యాయి. బియ్యం స్వాధీ నం చేసుకొని, అనంతుల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల టౌన్ సీ కృష్ణ తెలిపారు.
పాత పెన్షన్ విధానానికి కృషి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నుంచి విముక్తి కల్పించి పాత పెన్షన్ విధానానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ జిల్లా కేంద్రంలో నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాలు పనిచేసినా ఏ పదవిని ఆశించలేదని తెలిపారు. రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగి ఉన్నానని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ పేద ప్రజల పక్షాన వాదనలు వినిపిస్తున్నానని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును వేసి గెలుపునకు సహకరించాలని కోరారు.
విషజ్వరంతో చిన్నారి మృతి
● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
● న్యాయం చేయాలని డిమాండ్
సిరిసిల్లటౌన్: సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణం చంద్రపేటకు చెందిన లహరి(6)ని వైరల్ జ్వరంతో జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేర్పించారు. మూడు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హఠాత్తుగా కరీంనగర్‌కు రెఫర్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌లో చికిత్స తీసుకుంటూ చిన్నారి మరణించింది. గత మూడు రోజులుగా సిరిసిల్లలోని డాక్టర్ సరిగ్గా చికిత్స చేయకపోవడంతోనే మరణించిందని ఆ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment